కూకట్ పల్లి Y జంక్షన్ దగ్గర భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ( ఆగస్టు 21 ) KKR కమర్షియల్ కాంప్లెక్స్ లోని 7వ అంతస్తులో జరిగింది ఈ ప్రమాదం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... కాంప్లెక్స్ 7వ అంతస్తులో ఉన్న అర్బన్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
మంటలు మొదలైన వెంటనే సిబ్బంది బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు సిబ్బంది.
►ALSO READ | కడప ఎంపీ అవినాష్ ఇంట్లో డబ్బులు, బ్యాంక్ లాకర్లు ఈడీ సీజ్
అర్బన్ కంపెనీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్యానిక్ అవ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడాలని సూచిస్తున్నారు పోలీసులు.
కమర్షియల్ కాంప్లెక్స్ లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండ పాటించాలని... లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
