తప్పిన ప్రమాదం: పిల్లల స్కూల్ వ్యానుకు మంటలు

తప్పిన ప్రమాదం: పిల్లల స్కూల్ వ్యానుకు మంటలు

స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న వ్యాన్ కు మంటలు అంటుకున్నాయి. శనివారం పొద్దున నారాయణ పేట్ జిల్లా నర్వ మండలం లోని పిల్లలను వ్యాన్ లో స్కూల్ కు తీసుకెళ్తుండగా సదరు వ్యానుకు మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తమయి… పిల్లలను వ్యాను నుంచి దించేశాడు. మంటలు ఎక్కువగా వ్యాపించి వ్యాను పూర్తిగా కాలిపోయింది. నర్వ మండలంలోని కోమార్ లింగంపల్లి నుండి ఆత్మకూరు లో ఉన్న స్కూల్ కు పిల్లలను తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.