హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని వనస్థలి పురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందిరానగర్ లోని  ఓ టైర్ల గోడౌన్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోడౌన్ కు చేరుకొని మంటలు  ఆర్పేందుకు ప్రయత్నించారు. దీపావళీ పండుగ సందర్భంగా పేల్చిన బాణాసంచా రవ్వలు పడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆస్తి నష్టం జరిగినట్టు చెబుతున్నారు.