హైదరాబాద్లో అగ్ని ప్రమాదం..

 హైదరాబాద్లో  అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఓల్డ్ సంతోష్ నగర్ లోని టిఫిన్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని  జిల్లా అగ్నిమాపక అధికారి రంజిత్ తెలిపారు. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారని చెప్పారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.