కాన్పూర్ లో భారీ అగ్ని ప్రమాదం

కాన్పూర్ లో భారీ అగ్ని ప్రమాదం

యూపీ కాన్పూర్ లో మంటలు చెలరేగాయి. కలెక్టర్ గంజ్ ఏరియాలోని ఓ గోడౌన్ లో మంటలంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో స్పాట్ కు చేరుకుని మంటల్ని ఆర్పేశారు. గోడౌన్ లో ఉన్న ఐదుగురిని సురక్షితంగా కాపాడారు. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.