హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. చెప్పుల షాపులో మంటలు

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. చెప్పుల షాపులో మంటలు

హైదరాబాద్ లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెత్తాబజార్ లోని చెప్పుల షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఉన్న చెప్పుల గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  రెండు ఫైరింజన్లతో మంటలార్పారు.