కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఒరిజినల్ మాన్‌స్టర్’. ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంద్ పండిట్ సమర్పణలో యమున చంద్రు నిర్మిస్తున్నారు. తెలుగు నటుడు సునీల్ కీలకపాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
చేతిలో కత్తితో ఫెరోషియస్‌గా కనిపిస్తున్న శివరాజ్ కుమార్ డబ్బు నింపిన బ్యాగుతో బుల్లెట్‌పై వెళ్తున్న విజువల్స్ ఆకట్టుకున్నాయి. తన శరీరంపై రక్తపు మరకలు, వెళ్తున్న దారిలో డెడ్ బాడీస్ కనిపించడం ఈ మూవీ యాక్షెన్ సీక్వెన్సులపై అంచనాలు పెంచుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను త్వరలో రివీల్ చేయనున్నారు.
