
జ్యోతి రాయ్(Jyothi rai) అంటే మన తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. గుప్పెడంత మనసు జగతి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ప్రముఖ ఛానెల్ లో ప్రసారవుతున్న ఈ సీరియల్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ లో రిషి తల్లిగా, చాలా పద్దతిగా కనిపించే జగతి పాత్రకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ.. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫొటోలతో అందరికీ షాకిచ్చింది. పొట్టి పొట్టి డ్రెసులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.
ఇక తాజాగా ఒకడుగు ముందుకేసి లిప్ లాక్ తో రెచ్చిపోయింది. జ్యోతి రాయ్ నటిస్తున్న వెబ్ సిరీస్ నో మోర్ సీక్రెట్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ లో లిప్ లాక్ తో రెచ్చిపోయింది జ్యోతి రాయ్. ఇది చుసిన ఆడియన్స్ ఒక్కసారీ షాకవుతున్నారు. ఇక నో మోర్ సీక్రెట్స్ లో కృనాల్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. విజయ్ కుడికుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పోస్టర్ తోనే ఈ రేంజ్లోనే రెచ్చిపోయింది అంటే పూర్తి సిరీస్ లో ఎలాంటి సీన్స్ ఉంటాయో అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.