ఆరంభం మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌‌‌‌ విడుదల

ఆరంభం మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌‌‌‌ విడుదల

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో అజయ్ నాగ్ వి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆరంభం’. అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు.  ఈ ఎమోషనల్ థ్రిల్లర్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌‌‌‌ను  విడుదల చేసిన హీరో శ్రీ విష్ణు.. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పాడు.

 'అనగా అనగా..’ అంటూ సాగే ఈ పాటను సింజిత్ ఎర్రమిల్లి కంపోజ్ చేయగా ఎస్పీ చరణ్ పాడాడు.  ‘వాలే పొద్దుల్లో పాడిందే పాట, చుట్టేస్తుంటారే ఈ ఊరంతా.. హద్దే లేకుండా ఆడిందే ఆట, లేదే బేజారంట.. సాగే మేఘాలే దారే మారాయే’ అంటూ ఊరి నేపథ్యంలో ఆహ్లాదకరమైన సాహిత్యం రాశాడు స్వరూప్ గోలి. త్వరలో ఈ చిత్రం థియేటర్స్‌‌‌‌లో విడుదల కానుంది. లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ఇతరపాత్రలు పోషించారు.