కంటతడి పెట్టించే క్లైమాక్స్‌తో రానున్న సతీష్ జై గజ

కంటతడి పెట్టించే క్లైమాక్స్‌తో రానున్న సతీష్ జై గజ

సతీష్‌‌ జై హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘గజ’.  ఫర్నాజ్‌‌ శెట్టి హీరోయిన్. చల‌‌మ‌‌ల‌‌శెట్టి సునీల్ సమర్పణలో డా. మైత్రి శరణ్ నిర్మించారు.  మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం ‘అల్లకల్లోలంగా’ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ క్యాచీ లిరిక్స్ అందించగా, రామ్ మిరియాల పాడిన తీరు ఆకట్టుకుంది.

సాంగ్ లాంచ్‌‌ ఈవెంట్‌‌కు దర్శకుడు సాయి రాజేష్​ ముఖ్య​అతిథిగా హాజరై బెస్ట్ విషెస్‌‌ చెప్పారు.  అనంతరం హీరో సతీష్ జై మాట్లాడుతూ ‘నాతో పాటు ఈ సినిమాకు మణిశర్మ గారు బ్యాక్ బోన్‌‌లా నిలబడ్డారు. కమర్షియల్ అంశాలతో పాటు  మంచి మెసేజ్, ఎమోషన్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకోవడం ఖాయం. అంతలా అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నాడు. ఎన్నో కష్టాలను, సవాళ్లని ఎదుర్కొని సతీష్ ఈ చిత్రాన్ని రూపొందించారని మణిశర్మ చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి చెప్పింది. ఇందులోని ఎమోషన్ అందరికీ నచ్చుతుందని నిర్మాత మైత్రి శరణ్ అన్నారు. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్,  లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.