టైగర్ 3.. ఫస్ట్ సింగిల్  యూట్యూబ్‌‌లో ట్రెండ్

టైగర్ 3.. ఫస్ట్ సింగిల్  యూట్యూబ్‌‌లో ట్రెండ్

 సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌‌ జంటగా నటించిన ‘టైగర్ 3’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్  యూట్యూబ్‌‌లో ట్రెండ్ అవుతోంది. విడుదలైన మూడు రోజుల్లో ముప్ఫై మూడు మిలియన్ వ్యూస్‌‌తో దూసుకుపోతోంది. ప్రీతమ్ ట్యూన్ చేసిన ఈ పాటను హిందీలో అర్జిత్ సింగ్, నికితా గాంధీలు పాడగా, బెన్ని దయాల్, అనూష మణి తెలుగు, తమిళ భాషల్లో పాడారు.

‘ఎగిరే మనసే, ఆకాశ వీధుల్లో’ అంటూ చంద్రబోస్ తెలుగు లిరిక్స్  రాశారు. ఇందులో సల్మాన్, కత్రినా కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. పాటకొస్తున్న రెస్పాన్స్ గురించి కత్రినా మాట్లాడుతూ ‘ఈ సాంగ్ ఇంత సక్సెస్ అవడం ఎంతో ఆనందంగా ఉంది.  పాట అయినా, సినిమా అయినా జనాలకు కనెక్ట్ అయినప్పుడే పెద్ద హిట్ అవుతుంది. నా కెరీర్‌‌‌‌లో ఉన్న ఎన్నో మరపురాని పాటల జాబితాలో ఇది కూడా చేరుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పింది. మనీష్ శర్మ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 12 హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది.