ఆకాశంలో రింగ్ ఆఫ్ ఫైర్.. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం అద్భుతం

ఆకాశంలో రింగ్ ఆఫ్ ఫైర్.. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం అద్భుతం

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం.. అకాశంలో సూర్యుడు మండుతున్న ఉంగరంలా(రింగ్ ఆఫ్ ఫైర్) కనిపించాడు. ఆకాశంలో ఈ అద్భుత ఖగోళ దృశ్యాలు  శాస్త్రవేత్తలు వీక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. భారత్ లో సూర్యగ్రహణ ప్రభావం కనిపించలేదు గానీ.. అంటార్కిటికా రీజియన్ లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. ఫుల్ డిటెయిల్స్..  

మంగళవారం(ఫిబ్రవరి 17) సంపూర్ణ సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్  ఏర్పడింది. అంటార్కిటికా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో  సూర్యగ్రహణం కనిపించింది. అంటార్కిటికా, దక్షిణా అమెరికా ప్రాంతాల్లో సూర్యుడు చంద్రుడి సిల్ హౌట్ చుట్టూ ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న  వలయంలా  కనిపించాడు. ఈ అద్భుత దృశ్యం ఖగోళ శాస్త్రవేత్తలకు, వీక్షకులను ఎంతో ఆకట్టుకుంది. 

ఈ అరుదైన ఖగోళ సంఘటన చంద్రుడు.. భూమి సూర్యుడి మధ్య ప్రయాణిస్తున్నప్పుడు జరుగుతుంది. దీంతో సూర్యుడిని పూర్తిగా కప్పకుండా సూర్యుడు చంద్రుని సిల్ హౌట్ చుట్టూ ప్రకాశించే వలయం కనిపించాడు. 

రింగ్ ఆఫ్ ఫైర్..

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మంగళవారం సాయంత్రం 4.3 గంటలకు ప్రారంభమైంది.  రాత్రి 7.57 గంటలకు ముగిసింది.  రింగ్ ఆఫ్ ఫైర్  రెండు నిమిషాల ఇరవై సెకన్లు వరకు కనిపించింది. ఇది సూర్యుని కేంద్రం 96 శాతంగా ఉందని శాస్త్రవేత్తల అంచనా. 

భారత్ లో సూర్యగ్రహణ ప్రభావం కనిపించకపోవడంతో అటు ఖగోళ శాస్త్రవేత్తలు, వీక్షకులకు కొంత నిరాశ కలిగింది. అయితే NASA , ఇతర లైవ్ ల ద్వారా సూర్యగ్రహణాన్ని తిలగించారు. తమ జీవితంలో ఓ అపూర్వ క్షణాలను ఆస్వాదించారు.