జూన్‌‌‌‌లో తొలి తెలుగు ట్రావెల్ ఓటీటీ

జూన్‌‌‌‌లో తొలి తెలుగు ట్రావెల్ ఓటీటీ

దాదాపు ఇరవై  ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్  ఓటీటీ  ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి, ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది.

తాజాగా కేన్స్  ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌లో  ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీసత్య చేతుల మీదగా ‘విహారి ఓటీటీ’ గ్లోబల్ విజన్‌‌‌‌ను లాంచ్ చేశారు. ఈ తొలి తెలుగు ట్రావెల్ ఓటీటీని  జూన్‌‌‌‌లో ప్రారంభించనున్నట్టు తెలియజేశారు.  దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని నిర్వాహకులు తెలియజేశారు.