న్యూజిలాండ్‌‌‌‌తో తొలి టెస్ట్‌‌‌‌ నజ్ముల్‌‌‌‌ సెంచరీ

న్యూజిలాండ్‌‌‌‌తో తొలి టెస్ట్‌‌‌‌ నజ్ముల్‌‌‌‌ సెంచరీ

సిల్హెట్‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. కెప్టెన్‌‌‌‌ నజ్ముల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ షాంటో (104 బ్యాటింగ్‌‌‌‌) సెంచరీతో చెలరేగడంతో.. గురువారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు బంగ్లాదేశ్‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 68 ఓవర్లలో 212/3 స్కోరు చేసింది. 

షాంటోతో పాటు ముష్ఫికర్‌‌‌‌ రహీమ్‌‌‌‌ (13 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. మహ్మదుల్లా హసన్‌‌‌‌ జాయ్‌‌‌‌ (8), జాకీర్‌‌‌‌ హసన్‌‌‌‌ (17) ఫెయిలయ్యారు. 26 రన్స్‌‌‌‌కే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాను షాంటో సెంచరీతో ఆదుకున్నాడు. మోమినల్‌‌‌‌ హక్‌‌‌‌ (40)తో  మూడో వికెట్‌‌‌‌కు 90, ముష్ఫికర్‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌కు 96 రన్స్‌‌‌‌ జోడించాడు. 

అంతకుముందు 266/8 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌‌‌‌ కొనసాగించిన న్యూజిలాండ్‌‌‌‌ 101.5 ఓవర్లలో 317 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. తైజుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ 4, మోమినల్‌‌‌‌ హక్‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లా 205 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో కొనసాగుతున్నది.