
ఇదివరకు ఇంట్లో కరెంట్ పోగానే కొవ్వొత్తుల కోసం వెతికేవాళ్లు. ఇప్పుడు బ్యాటరీ ల్యాంప్ కోసం వెతుకుతున్నారు. కానీ.. కొందరు మాత్రం క్యాండిల్ని అప్పుడప్పుడు డెకరేట్ చేయడానికి వాడుతున్నారు. అలాంటివాళ్లకు ఇది బెస్ట్ చాయిస్. దీన్ని ఎల్టెట్టెస్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది క్యాండిల్లా కనిపిస్తుంది. కానీ.. క్యాండిల్ కాదు. బ్యాటరీతో పనిచేసే ఎల్ఈడీ లైట్. దీన్ని రిమోట్‌తో ఆపరేట్ చేయొచ్చు.
ఇందులో డాన్సింగ్ ఫ్లేమ్ టెక్నాలజీతో వెలిగే లైట్ ఉంటుంది. అందువల్ల అచ్చం క్యాండిల్ వెలిగినట్టే అనిపిస్తుంది. గట్టి గాజుతో తయారుచేయడం వల్ల ఇది కింద పడినా పగిలిపోయే అవకాశాలు తక్కువ. రిమోట్‌తో టైమర్, బ్రైట్నెస్ లెవెల్ లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో రెండు ఏఏ బ్యాటరీలు వేయాల్సి ఉంటుంది. వాటర్ ఫ్రూఫ్‌తో వస్తుంది కాబట్టి వర్షంలో కూడా వాడుకోవచ్చు.