నల్లని జుట్టు కోసం... అమ్మమ్మల కాలం నాటి శీకాకాయ్ చిట్కాలు.. వద్దన్నా జుట్టు పెంచేసే..

నల్లని జుట్టు కోసం... అమ్మమ్మల కాలం నాటి శీకాకాయ్ చిట్కాలు.. వద్దన్నా జుట్టు పెంచేసే..

ఈ రోజుల్లో మారుతున్న లైఫ్ స్టైల్, పొల్యూషన్ వల్ల జుట్టు రాలడం, చుండ్రు రావడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వీటి కోసం మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ షాంపూలు, ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మన అమ్మమ్మల కాలం నాటి సహజసిద్ధమైన 'శీకాకాయ'ను నమ్ముకుంటే చాలు. జుట్టు సంరక్షణలో శీకాకాయను మించిన బెస్ట్ నేచురల్ రెమెడీ మరొకటి లేదు.

కురులను పట్టులా మెరిపించడమే కాకుండా, తలలో వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేసే అద్భుతమైన గుణాలు శీకాకాయలో ఉన్నాయి. మరి శీకాకాయతో జుట్టుకు కలిగే లాభాలేంటి ? దాన్ని ఇంట్లోనే హెయిర్ ప్యాక్ రూపంలో ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం...

*శీకాకాయలో ఉండే యాంటీ ఆక్సి డెంట్స్, విటమిన్ -ఎ, సి, డి, కె హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి. వీటితో ఇంకా బోలెడు లాభాలు ఉన్నాయి.

*శీకాకాయలో ఉన్న యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు, డెడ్ స్కిన్ సెల్స్ను దూరంచేస్తాయి. వాటివల్ల కలిగే డ్రైనెస్, చికాకులను పోగొడతాయి.

*జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది. అందుకు శీకాకాయలో ఉన్న ఆల్కలాయిడ్స్ సాయపడతాయి. ఇది స్కా ల్స్లో ఉన్న పిహెచ్ను కంట్రోల్ చేస్తుంది. దురద, చికాకులను పోగొడుతుంది.జుట్టు తొందరగా నెరిసిపోనివ్వదు.

*ఇందులోని ఆస్ట్రింజెంట్ గుణం జుట్టుకు అంటుకున్న చెమట, మురికిని పోగొట్టి మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది.

*శీకాకాయ లాభాలు పొందాలంటే ఇంట్లోనే హెయిర్ ప్యాక్స్  తయారుచేయొచ్చు. గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల శీకాకాయ్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలపాలి. రెండోది నెయ్యి, ఆమ్లా, శీకాకాయ పొడులన్నీ ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకొని గిన్నెలో కలపాలి. ఈ రెండు ప్యాక్ ఏదైనా వారానికి ఒకసారి జుట్టుకు రాసుకొని అరగంట ఉంచి మామూలు నీళ్లతో స్నానం చేయాలి.