జెన్ Z గురించి ఏం మాట్లాడుకున్నా కొత్తగానే అనిపిస్తుంది. వారి లక్షణాలు అసాధారణంగా.. కొంత కొత్తగా.. కొంత వింతగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా లవ్, రిలేషన్ షిప్ విషయంలో జనరేషన్ జెడ్ ఆలోచనా ధోరణలు చాలా విచిత్రంగా ఉన్నట్లు స్టడీలో తేలింది. ఒకరిని లవ్ చేయాలన్నా, రిలేషన్షిప్ పెట్టుకోవాలన్నా.. మిలీనియం బ్యాచ్ లేదా అంతకంటే ముందు తరాలు.. పర్ఫెక్షన్ చూసేవాళ్లు. కానీ ఈ తరం మాత్రం.. పర్ఫెక్షన్ తో పనిలే.. నాకున్న పిచ్చి నీకు కూడా ఉంటే చాలు.. అన్నట్లుగా ఆలోచిస్తున్నారు.
జెన్ జెడ్ అంటే చిత్ర, విచిత్రమైన మనస్తస్థాలు కలిగిన తరం. ఏదైనా ఇన్ స్టంట్ డెసిషన్స్, ఇన్ స్టంట్ రిజల్ట్ అన్నట్లుగా ఉంటారు. ఆ తర్వాతి పరిణామాల గురించి ఆలోచించరు. ఇప్పటికిప్పుడు ఏంటి అనేది వీరి ధోరణి. అది ఎప్పటికీ నష్టం కలిగించే అలవాటు అయినా వారు అంత వరకు ఆలోచించరు. ఇక ప్రేమ విషయంలో తమ లాగే విచిత్రమైన అలవాట్లు మ్యాచ్ అయితే చాలు అనుకుంటున్నారట.
అవును, ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఆసక్తికరమైన ట్రెండ్ ఈ రోజుల్లో జెన్ Z (Gen Z) తరంలో పాపులర్ అవుతోంది. దీనికి 'ఫ్రీక్ మ్యాచింగ్' అని పేరు పెట్టారు. పరిపూర్ణతకు (పర్ఫెక్షన్) బదులుగా, తమకున్న ప్రత్యేక లక్షణాలు, చిత్రమైన అలవాట్లు ఉన్న వారినే ఎంచుకునే భావన ఫ్రీక్ మ్యాచింగ్. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
- ఫ్రీక్ మ్యాచింగ్ ('Freak matching) అంటే?
సింపుల్ గా చెప్పాలంటే, 'ఫ్రీక్ మ్యాచింగ్' అంటే మీ విచిత్రమైన అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు, విభిన్నమైన ఆలోచనా విధానాలను అర్థం చేసుకోవడమే కాకుండా, అలాంటి విషయంలో మీకు అండగా నిలిచే ఫ్రెండ్, లవర్ లేదా పాట్నర్ ను ఎంచుకోవడం. రిలేషన్స్ కేవలం సేమ్ లక్ష్యాలు లేదా ఒకే సేమ్ ఇంట్రెస్ట్ లపై మాత్రమే ఆధారపడి ఉండవు. కామన్ పీపుల్ కు విచిత్రమైనవి లేదా అసాధారణమైనవి (Unusual) అని భావించే విషయాలలో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు.
- మీమ్స్ ఇష్టపడటం మాత్రమే సరిపోదు.
ఈ ట్రెండ్ వినడానికి సరదాగా, భయపెట్టేలా అనిపించినప్పటికీ, ఒకే రకమైన విచిత్ర ప్రవర్తనలు లేదా ఆసక్తులు కలిగిన వారి మధ్య సంబంధం ఎక్కువ కాలం ఉండటానికి తోడ్పడుతుందని చెప్పలేమని అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఇంటర్నెట్‌లో ఒకే రకమైన మీమ్స్‌ను ఇష్టపడవచ్చు. లేదా కల్చరల్ గా ఒకే రకమైన ఇష్టాఇష్లాలు కలిగి ఉండవచ్చు. కానీ లైఫ్ డెసిషన్స్ విషయానికి వస్తే, వారి ఆలోచనలు ఒకేలా ఉండకపోవచ్చు.
మొత్తమ్మీద, 'ఫ్రీక్ మ్యాచింగ్' మీ పిచ్చిలో మీకు మద్దతు ఇచ్చే పాట్నర్ ను అందిస్తుందేమో, కానీ స్ట్రాంగ్ రిలేషన్షిప్, బేసిక్ వ్యాల్యూస్ విషయంలో ఇది సెట్ అవ్వకపోవచ్చునని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు.
