జ్యోతిష్యం : మీ జాతకంలో ఈ 4 గ్రహాలు ఉంటే.. ఉద్యోగంలో తిరుగుండదు.. మీకు ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది..!

జ్యోతిష్యం : మీ జాతకంలో ఈ 4 గ్రహాలు ఉంటే.. ఉద్యోగంలో తిరుగుండదు.. మీకు ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది..!

క్లాస్​ లో ఫస్ట్​.. ర్యాంకుల్లో టాప్​.. కాని జాబ్​ లో ఫెయిల్​ అవుతారు కొంతమంది. ఎంత చదువుకున్నా.... కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​ ఎంత బాగా రాసినా.. . జాబ్​ మాత్రం రాదు.  అలాంటి వారికి అదృష్టం లేదని కొందరంటుంటారు.  అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం..  కెరీర్.. ఉద్యోగం ... ప్రమోషన్ పరంగా  నాలుగు  గ్రహాల స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది.  జాతక చక్రంలో బుధుడు.. సూర్యుడు.. కుజుడు....  శని గ్రహాలు  ఉన్న స్థానాలను బట్టి వారి  ఉద్యోగాలుంటాయని పండితులు చెబుతున్నారు.   ఈ నాలుగు గ్రహాల దృష్టి మంచిగా ఉన్న వారు తక్కువ సమయంలోనే  మంచి ఉద్యోగం సాధించి.. ఉన్నత స్థానాన్ని చేరుకుంటారని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది. .

బుధుడు :  ఈ గ్రహం.. తెలివితేటలు.. వ్యాపారాలకు సంబంధించినది.  జాతకంలో బుధ గ్రహం మంచిగా ఉంటే.. విద్య తక్కువున్నా.. తెలివితేటలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.  ఉదాహరణకు కొంతమంది స్పోర్ట్స్​ కోటాలో  గెజిటెడ్​ ఆఫీసర్​ జాబ్​ వస్తుంది.. వారు చదివిన దానికి.. చేస్తున్న ఉద్యోగానికి ఏం సంబంధం ఉండదు.. అంటే వారి తెలివితేటల ఆధారంగా జాబ్​ లభిస్తుంది.  జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం.. బుధ గ్రహం వారికి అనుకూలించడం వలన అలాంటి ఫలితాన్ని పొందారు. జాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉంటే ..  కెరీర్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ప్రయోజనాలు పొందుతారు. బుధుడు అనుగ్రహం కోసం ఆయను ఇష్టమైన ఆకుపచ్చని వస్తువులు ప్రీతికరమైనవి, అందువలన ఆకుకూరలు, బచ్చలికూర వంటివి దానం చేయాలి. 

సూర్యుడు : ఈ గ్రహాన్ని నవగ్రహాలకు రాజు అని పిలుస్తారు.  జాతకరీత్యా ఈ గ్రహం దృష్టి బాగుంటే ఉద్యోగం.. గౌరవం.. టీమ్​ లీడర్​ షిప్​ క్వాలిటీస్​ కలిగి ఉంటారు.  జాతక చక్రంలో పదవస్థానంలో ఒక్క  సూర్యుడు ఉంటే  కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.ఇంకా ఈ గ్రహం శుభ స్థానంలో  ఉంటే ఆఫీసులో బాస్​ పాత్రను పోషిస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే వారికి కేరీర్​ పరంగా ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

కుజుడు:  కుజుడిని భూమి పుత్రుడిగా జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ గ్రహం అనుకూలించిన వారు అదృష్టవంతులు  ...  కుజ గ్రహం ధైర్యం... సాహసానికి ప్రతీక.. ఈ గ్రహం శుభ ప్రదంగా ఉంటే.. వృత్తి.. వ్యాపారంలో అనుకున్న ఫలితాలను పొందుతారు.  ఈ గ్రహం అనుకూలించకపోతే.. ఎంత డబ్బున్నా.. ఉద్యోగంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా.. గౌరవం.. కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది.   సమాజంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారు ..  కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.  మంగళవారం ఉపవాసం ఉండటం, కందిపప్పుతో చేసిన పదార్థాలు తినడం వంటివి కూడా కుజదోష నివారణకు మంచి మార్గాలని చెబుతారు. ఎర్రటి వస్తువులు, రాగి, బెల్లం, కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. 

శని :  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహం  కర్మ యోగానికి కారకంగా పనిచేస్తాడు.  శని గ్రహం  జాతకంలో శుభ స్థానంలో ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  జాబ్​ లో ఇబ్బందులు పడుతుంటే.. శనీశ్వరుని అనుగ్రహం తప్పనిసరి.  ఇబ్బంది పడే ఉద్యోగస్తులు ప్రతి శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేసి.. నల్ల నువ్వులు దానం చేస్తే ఉపశమనం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పేదవారికి వస్త్రదానం  చేయాలి.