ఫ్రాన్స్‌లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ నిరసనలు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. సోమవారం పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ లూవ్రే మ్యూజియం ప్రవేశద్వారాన్ని నిరసనకారులు దిగ్భంధించారు. దీంతో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దుకాణాలు, ప్రభుత్వ భవనాలు ధ్వంసం కాగా, పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘటనల్లో వేలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
🇫🇷 Chers visiteurs, en raison d’un mouvement social étudiant, le musée est fermé pour le moment. Nous vous prions de nous excuser de la gêne occasionnée. 🌍Dear visitors, due to student strikes the museum is currently closed. We apologise for the inconvenience. https://t.co/tNKFk3B9aj
— Musée du Louvre (@MuseeLouvre) October 19, 2026
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని నగరాల్లో కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. భద్రతా వైఫల్యాలపై సమీక్ష చేపట్టాలని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదేశించారు. అయితే, అతివాద వర్గాలే నిరసనల్లో హింసకు కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు, ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మార్చి నుంచి డీజిల్ ధరలు దాదాపు 40 శాతం, పెట్రోల్ ధరలు 25 శాతం పెరిగాయని రిపోర్టులు చెబుతున్నాయి. 2021 నుంచి ఆహార ధరలు కూడా 25 శాతం పెరిగాయి. దీంతో జీవన వ్యయాన్ని భరించలేక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాపాడాలని యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చింది. అదే సమయంలో దాడులు, దోపిడీలు, విధ్వంసాన్ని అంగీకరించలేమని స్పష్టం చేసింది. ధరల పెరుగుదలతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఫ్రాన్స్‌లో పెద్ద సంక్షోభంగా మారాయి.
🇫🇷 France's protests have reached the Louvre, with art and culture students blocking the entrance to the world's most visited museum this morning. A protester says the tourists stuck in line are getting aggressive with them, since they've already paid for their tickets. https://t.co/TgW9kjJQ2O
— VICTOR (@victorLiuFu) October 19, 2026
🇫🇷 Chers visiteurs, en raison d’un mouvement social étudiant, le musée est fermé pour le moment. Nous vous prions de nous excuser de la gêne occasionnée. 🌍Dear visitors, due to student strikes the museum is currently closed. We apologise for the inconvenience. https://t.co/tNKFk3B9aj
— Musée du Louvre (@MuseeLouvre) October 19, 2026
