టెక్నాలజీ..యూట్యూబ్​లో ఫ్రీ ఎడిటింగ్ యాప్

టెక్నాలజీ..యూట్యూబ్​లో ఫ్రీ ఎడిటింగ్ యాప్

యూట్యూబ్​లో ఇండియన్ క్రియేటర్ల కోసం ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్​ తెచ్చింది. నిజానికి గత ఏడాదిలోనే ఈ ఫ్రీ యూట్యూబ్​ క్రియేట్​ యాప్​ని అనౌన్స్ చేసింది. దాన్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఈజీగా షార్ట్స్ చేసుకోవచ్చు. లేదంటే లాంగ్​ఫామ్​ కంటెంట్ రెండింటికీ వీడియో ఎడిటింగ్​ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్రియేటివిటీకి మరింత పదును పెట్టేందుకు స్టోరీ బేస్డ్​ వీడియోలను కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ యాప్​ ఇప్పుడు భారత్​ సహా 13 దేశాల్లో అందుబాటులో ఉంది. అందులో ప్రధానంగా ఆండ్రాయిడ్ డివైజ్​ల్లో బీటా మోడ్​లో మాత్రమే అందుబాటులో ఉంది. 

ఇప్పటివరకు ఉన్న యూట్యూబ్​ వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంది. టైం ఎక్కువ తీసుకుంటుంది. ఛార్జ్​ కూడా ఎక్కువే. ఈ ప్రాబ్లమ్​కి ఇప్పుడు సొల్యూషన్ దొరికింది. ఎడిటింగ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా డెవలప్​ చేశారు. ఈ కొత్త యాప్​ స్టార్ట్​ చేశాక గత కొన్ని నెలల్లోనే గ్లోబల్ క్రియేటర్ కమ్యూనిటీ నుంచి మంచి ఫీడ్​ బ్యాక్ వచ్చింది. అవసరమైన ఫీచర్లను కూడా చేర్చింది. 

అదిరిపోయే ఫీచర్లు!

  •     యూట్యూబ్ క్రియేట్​ యాప్​లో ఫుటేజీని క్యాప్చర్​ చేయాలి. 
  •     సౌండ్​ ట్రాక్ కోసం యాప్​లో వేలల్లో పాటలు ఉన్నాయి. వాటిలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. 
  •     మూడ్​ని సెట్​ చేసేలా విజువల్స్​కు తగినట్టుగా ఉండే పాట సెలక్ట్ చేసుకోవచ్చు. 
  •     యూట్యూబ్ క్రియేట్​ మ్యూజిక్ లైబ్రరీలో రాయల్టీ ఫ్రీగా ఉంటాయి. కాబట్టి కాపీరైట్ గురించి పడుతుందన్న ఇబ్బంది లేదు. 
  •     వీడియోలో మ్యూజిక్​తో సింక్​ అయ్యే బీట్ మ్యాచింగ్​ ఫీచర్​ వాడాలి. టైమ్​లైన్​లో గుర్తించడానికి ‘ఫైండ్ బీట్స్’ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి. 
  •     వీడియో క్వాలిటీ కోసం స్టిక్కర్లు, జిఫ్​, ఎఫెక్ట్​, ఫిల్టర్స్​ లైబ్రరీని వాడాలి. 
  •     వీడియో ఫుటేజ్​లో బ్యాక్​గ్రౌండ్ నాయిస్ తీసేసేందుకు ఆడియో క్లీనప్​ టూల్​ వాడాలి. ఈ టూల్ సాయంతో వాయిస్​ క్లియర్​గా ఉంటుంది. 
  •     టూల్​పై ఒకసారి ట్యాప్ చేస్తే వీడియో ప్లే అయ్యే టైంలో బ్యాక్​గ్రౌండ్​లో వినిపించే అనవసరమైన శబ్దాలను తీసేయొచ్చు. 
  •     క్యాప్షన్లను ఎడిట్ చేసేందుకు వీలుగా ఆటో క్యాప్షనింగ్ ఫీచర్ కూడా ఉంది. 
  •     టెక్స్ట్​ ఫార్మాట్​ను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసేందుకు వివిధ స్టయిలింగ్ ఆప్షన్లను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. 
  •     వీడియో స్టోరీ గురించి వివరించేందుకు వాయిస్ ఓవర్​ ఇవ్వొచ్చు. వీడియో ఎడిట్ చేశాక నేరుగా యూట్యూబ్​లో అప్​ లోడ్ చేయొచ్చు.