పెండ్లి హామీ ఉల్లంఘన ..క్రిమినల్‌‌ చర్య కాదు..హైకోర్టు ఆదేశాలతో కేసు కొట్టివేత

పెండ్లి హామీ ఉల్లంఘన  ..క్రిమినల్‌‌ చర్య కాదు..హైకోర్టు ఆదేశాలతో కేసు కొట్టివేత

హైదరాబాద్, వెలుగు: పెళ్లి చేసుకుంటాననే హామీ ఉల్లంఘన క్రిమినల్‌‌ చర్య కిందకు రాదని హైకోర్టు తేల్చింది. హైదరాబాద్‌‌కు చెందిన జీవన్‌‌రెడ్డి అనే యువకుడు తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి మోసానికి పాల్పడ్డాడంటూ కె.పద్మిని అనే మహిళ ఫిర్యాదు మేరకు కర్మన్‌‌ఘాట్‌‌ పోలీసులు ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేశారు. 

తనపై క్రిమినల్‌‌ కేసు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమంటూ జీవన్‌‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పెళ్లి చేసుకుంటానన్న హామీ ఉల్లంఘన క్రిమినల్‌‌ చర్య కిందకు రాదని జస్టిస్‌‌ ఎన్‌‌.తుకారాంజీ పైవిధంగా ఇటీవల తీర్పు చెప్పారు. పెండ్లి చేసుకుంటామన్న హామీని అమలు చేయని పిటిషనర్‌‌ను పోలీసులు నిందితుడిగా చేర్చడాన్ని తప్పుపట్టారు. పిటిషనర్‌‌పై పోలీసు కేసును కొట్టేశారు. ఇతర అభియోగాలు ఉంటే పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చునని చెప్పారు.