నాన్నమ్మ చేతి వంటకానికి బ్రాండ్ క్రియేట్ చేశారు.. రూ.10 కోట్ల వ్యాపారంగా మార్చారు.. అక్కా చెల్లెళ్ల సక్సెస్ స్టోరీ!

నాన్నమ్మ చేతి వంటకానికి బ్రాండ్ క్రియేట్ చేశారు.. రూ.10 కోట్ల వ్యాపారంగా మార్చారు.. అక్కా చెల్లెళ్ల సక్సెస్ స్టోరీ!

ఇప్పుడున్న ట్రెండ్లో ఫుడ్ బిజినెస్ కొందరి జీవితాలను ఎలా నిలబెడుతుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల స్టోరీ. కుటుంబ సంప్రదాయాలను ట్రెండుకు తగ్గనట్లుగా మార్చుకుంటే..   దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే లక్షల్ల వ్యాపారాన్ని కోట్లకు పరుగులెత్తించడం తేలిక అని ప్రూవ్ చేశారు వీళ్లు. నానమ్మ చేతి వంట టెక్నిక్ ను బ్రాండ్ క్రియేట్ చేసి.. ట్రెండింగ్ ఆంత్రప్రెన్యూవర్ గా నిలిచారు. వీళ్ల జర్నీ ఎలా మొదలయ్యింది.. ఐద లక్షలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ను 10 కోట్ల రూపాయల బాడా వ్యాపారంగా ఎలా మార్చారో తెలుసుకుందాం.

 బెంగళూరుకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు రమ్య రవి, శ్వేత రవి తమ నానమ్మ తయారు చేసే కర్ణాటక స్టైల్ డొన్నె బిర్యానీ రెసిపీకి బ్రాండ్ క్రియేట్ చేసి రూ.10 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారంగా మలచారు. 2020లో కేవలం రూ.5 లక్షల పెట్టుబడితో ఆర్‌ఎన్‌ఆర్ డొన్నె బిర్యానీ (RNR Donne Biryani) అనే వెంచర్‌ను ప్రారంభించారు. కోవిడ్-19 సమయంలో నవంబర్ 2020లో బెంగళూరులోని 200 చదరపు అడుగుల చిన్న క్లౌడ్ కిచెన్‌తో ఈ ప్రయాణం మొదలైంది. ఒక వంటవాడు, కొంతమంది అసిస్టెంట్లతో మాత్రమే పని ప్రారంభించారు. ఇప్పుడు అది పెద్ద వ్యాపార సామ్రాజ్యం.

మొదటి నెలలోనే 10 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో వ్యాపారానికి పునాది పడింది. అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూడలేదు, అని రమ్య ది బెటర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అందరూ వెళ్లే మార్గంలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. మొదటి నుంచే ఖరీదైన డైన్-ఇన్ రెస్టారెంట్‌కు బదులు డెలివరీ-ఫస్ట్ విధానాన్ని ఎంచుకున్నారు. నాణ్యత, పరిశుభ్రత, స్థిరత్వంపై దృష్టి సారించారు. బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు కోసం అరటి ఆకులో చుట్టి టిన్ బాక్స్‌లో అందించే ప్యాకేజింగ్‌ను ఫాలో అయ్యారు. 

ఇవాళ ఆర్‌ఎన్‌ఆర్ డొన్నె బిర్యానీ 14 క్లౌడ్ కిచెన్‌లు, ఒక స్టాండ్‌అలోన్ రెస్టారెంట్‌తో పనిచేస్తోంది. సుమారు రూ.10 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. సిగ్నేచర్ బిర్యానీతో పాటు డ్రమ్‌స్టిక్-చిల్లి స్టార్టర్స్, మటన్ బోన్ సూప్, చికెన్ ఘీ రోస్ట్, ఎలనీరు పాయసం (కొబ్బరి పాయసం) వంటి వంటకాలు కూడా మెనూలో ఉన్నాయి.

వెజిటేరియన్, చికెన్ బిర్యానీలు రూ.269 నుంచి రూ.349 వరకు, మటన్ బిర్యానీ రూ.419కు అందుబాటులో ఉన్నాయి. ఇద్దరు సోదరీమణులు తమ నానమ్మ సాంప్రదాయ రుచిని  ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, చిన్న పెట్టుబడితో పెద్ద విజయం సాధించిన ఈ స్టోరీ.. ఈ తరానికి ఒక సక్సెస్ మోడల్ గా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు.