OTTకి వచ్చేసిన రూ.100 కోట్ల సినిమా.. చూసి ఫుల్లుగా నవ్వుకోండి!

OTTకి వచ్చేసిన రూ.100 కోట్ల సినిమా.. చూసి ఫుల్లుగా నవ్వుకోండి!

బాలీవుడ్ లో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ఫుక్రే3(Fukrey 3). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికే రెండు పార్టులు విడుదలవగా.. తాజాగా మూడో పార్ట్ విడుదలై.. భారీ విజయాన్ని అందుకుంది. నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మ, రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీలు కీలక పాత్రల్లో నటించగా.. దర్శకుడు మిర్ఘ్ దీప్ సింగ్ లాంబా ఈ సినిమాను తెరకెక్కించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ. నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది ఫుక్రే 3 మూవీ. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మరి వీలుంటే  మీరు కూడా ఈ కామెడీ ఎంటర్టైనర్ ను చూసి ఫులుగా నవ్వుకోండి.