- మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ
చింతలమానేపల్లి, వెలుగు: ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చేందుకు సీఎం చొరవ చూపాలని టీయూడబ్ల్యూ జే(ఐజేయూ) ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌రహమాన్, ప్రధాన కార్యదర్శి ఎస్. సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్7న ఆసిఫాబాద్‌లో నిర్వహించే టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా 3వ మహాసభ పోస్టర్లను శనివారం కౌటాల, చింతల మానేపల్లి మండలాల్లో ఆవిష్కరించారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్, అక్రెడిటేషన్ కమిటీ మెంబర్ ప్రకాశ్‌గౌడ్, ఆయా మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.
