హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా గేమ్ ఆన్‌.. ఆసక్తిరేపుతున్న ట్రైలర్

హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా గేమ్ ఆన్‌.. ఆసక్తిరేపుతున్న ట్రైలర్

గీతానంద్(Githa singh), నేహా సోలం(Neha solam)కి జంటగా నటించిన చిత్రం గేమ్ ఆన్‌‌. ద‌‌యానంద్ దర్శకుడు.  ర‌‌వి క‌‌స్తూరి నిర్మాత. మధుబాల, ఆదిత్య మీనన్‌‌, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 2న సినిమా రిలీజ్ కానుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా గీతానంద్ మాట్లాడుతూ ‘ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌‌గా పని చేస్తూ జీవితంపై విరక్తి చెందిన ఓ ఉద్యోగి.. మరొకరు ఆడిస్తున్న ఆన్‌‌లైన్‌‌ గేమ్‌‌లో పావుగా మారితే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా చూపించాం.

మధుబాల, ఆదిత్య మీనన్ గారు ఇందులో ఉండడం సినిమా  నెక్స్ట్ లెవెల్‌‌కు వెళ్లింది’ అని చెప్పాడు. తన పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పింది నేహా సోలంకి. దయానంద్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ  గ్రే షేడ్‌‌లో ఉంటాయి. యాక్షన్‌‌, రొమాన్స్,  ఎమోష‌‌న్స్ ఆక‌‌ట్టుకుంటాయి.  ఆడియెన్స్‌‌కు కొత్త ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు.  ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది అని నిర్మాత రవి కస్తూరి అన్నారు. నటులు ఆదిత్య మీనన్, కిరిటీ, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.