
హిందూమతంలో గణేశుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం, గణపతి విగ్రహాన్ని ఇంటి మెయిన్ గేట్దగ్గర ప్రతిష్టించుకుంటారు. అసలు ఇంటి ముందు వినాయకుడి విగ్రహాన్ని అందరూ ప్రతిష్టించుకోవచ్చా.. ఏఏ సందర్భాల్లో పెట్టుకోవాలి. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు చెబుతున్న సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. . .
ప్రశ్న: మేం ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇంట్లో చేరేటప్పుడు మెయిన్ గేట్ కు కుడివైపు చిన్న వినాయకుడి విగ్రహం పెట్టు కోమని సలహా ఇచ్చాడు ఓ సిద్ధాంతి. ఇంటి ముందు వినాయకుడి విగ్రహం ఎందుకు పెట్టుకుంటారు? పెట్టకపోతే నష్టమా?
జవాబు: మెయిన్ గేట్ కు పక్కన వినాయకుడి విగ్రహం పెట్టుకోవడం తప్పుకాదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే శుభం జరుగుతుందని అంటారు. అందుకని.. మీకు సిద్ధాంతి అలా చెప్పి ఉండొచ్చు. విగ్రహం పెట్టుకోకపోయినా నష్టం ఏమీ జరగదు. మీ ఇష్టాన్ని బట్టి నిర్ణయించుకోండి. వాస్తుకు, దీనికి ఎలాంటి సంబంధం లేదు.
–వెలుగు,లైఫ్–