ఆడితే ప్రశంసలు..విఫలమైతే విమర్శలు: గంగూలీ

ఆడితే ప్రశంసలు..విఫలమైతే విమర్శలు: గంగూలీ

ఫాంలేమితో ఇబ్బంది పడుతూ జట్టుకు భారంగా మారిన కేఎల్ రాహుల్ పై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. సొంత గడ్డపై ఆడే సమయంలో పరుగులు సాధించకపోతే తిట్లు తప్పవని గంగూలీ అన్నాడు.  ఇది కేఎల్ రాహుల్ ఒక్కడికే వచ్చిన సమస్య కాదని..గతంలో అనేక మంది ప్లేయర్లకు ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నాడు.  కేఎల్ రాహుల్ మంచి ఆటగాడని..అతను  అనేక మంచి ఇన్నింగ్స్ లు ఆడాడని కొనియాడాడు. టీమిండియాలో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ నుంచి ఫ్యాన్స్  ఇంకా ఆశిస్తారని....రాణిస్తే నెత్తిమీద పెట్టుకోవడమే కాదు... విఫలమైతే విమర్శలు కూడా చేస్తారన్నాడు. ఈ పరిస్థితిని అధిగమించగల సత్తా కేఎల్ రాహుల్ కు ఉందని భావిస్తున్నట్లు గంగూలీ అభిప్రాయపడ్డాడు. 


పంత్ కు రెండేళ్లు పడుతుంది..

అటు రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషభ్ పంత్ పై  సౌరవ్ గంగూలీ  కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ పూర్తిగా కోలుకుని తిరిగి టీమిండియా తరపున ఆడేందుకు దాదాపు రెండేళ్ల సమయం పడుతుందన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ లో పంత్ స్థానాన్ని భర్తీచేయడం కష్టమన్నాడు. అయితే అతడి స్థానంలో జట్టులోకి ఎవర్ని తీసుకోవాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదన్నాడు. పంత్‌కు ప్రమాదం జరిగిన తర్వాత అతనితో రెండుసార్లు మాట్లడినట్టు చెప్పాడు.