బంజారాహిల్స్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్

బంజారాహిల్స్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్

హైదరాబాద్ సిటీలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. కొంతమంది యువకులు బంజారాహిల్స్ లో ఉన్న ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చి దగ్గర దాడికి దిగారు.గంజాయి మత్తులో ముగ్గురు ఉన్న యువకులు చర్చి దగ్గర సిబ్బంది తోపాటు  మహిళలపై దాడి చేశారు. మహిళ ప్రతిఘటించడంతో గంజాయి బ్యాచ్ బైక్ లపై పరాయ్యారు. యువకుల దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న  సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

గంజాయి మత్తులో వచ్చిన యువకులు స్నానం చేయడానికి నీళ్లు కావాలని అడిగారని..నీళ్లు లేవని చెప్పడం తో దాడి చేసి కొట్టారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా యువకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.