Garividi Lakshmi: మ్యూజికల్‌‌‌‌ ఫీస్ట్‌‌‌‌లా గరివిడి లక్ష్మి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్ ఇవే

Garividi Lakshmi: మ్యూజికల్‌‌‌‌ ఫీస్ట్‌‌‌‌లా గరివిడి లక్ష్మి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్ ఇవే

ఆనంది ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.  అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది. తాజాగా విశాఖపట్నంలో ప్రీ  రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏపీ పొలిటికల్ లీడర్స్ గంటా శ్రీనివాసరావు, రఘురాం కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

గెస్ట్‌‌‌‌గా హాజరైన హీరో తేజ సజ్జా మాట్లాడుతూ ‘ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మాత్రమే కాదు, ప్రేక్షకులకు, గరివిడి లక్ష్మి గారి అభిమానులకు కూడా గౌరవం తీసుకొస్తుంది. సినిమా చూసిన అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.  మంచి మ్యూజికల్‌‌‌‌ ఫీస్ట్‌‌‌‌ ఇస్తూ,  థియేటర్‌‌‌‌‌‌‌‌లో  ఒక కాన్సర్ట్ చూస్తున్నట్టుగా ఉంటుంది’ అని అన్నాడు.

హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ ‘గరివిడి లక్ష్మి పాత్రలో   నటించినందుకు చాలా ఆనందంగా ఉంది.  ఎంతోమంది క్రెడిట్ తీసుకోకుండా కళాకారులుగా ఉండిపోయారు. వాళ్లందరికీ రిలేట్ అయ్యే మూవీ ఇది’ అని చెప్పింది.   ఒక జానపద కళాకారిణి గురించి సినిమా తీస్తే, ఆ సినిమాకు వస్తున్న అభినందనలు మామూలుగా లేవని, సినిమా రిలీజ్‌‌‌‌కు ముందే ఆ సక్సెస్‌‌‌‌ను ఎక్స్‌‌‌‌పీరియన్స్ చేస్తున్నానని దర్శకుడు గౌరీ నాయుడు అన్నాడు.

ఈ చిత్రం తమ సంస్థకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అన్నారు. నటుడు రాగ్ మయూర్,  మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.