ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్ని ప్రమాదం

ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్ని ప్రమాదం

జగిత్యాల: మెట్‎పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా సిలిండర్ స్టవ్ నుంచి గ్యాస్ లీకయి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే భార్య సరోజకు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్‎లోని ఆస్పత్రికి తరలించారు.