
సింగర్, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, నటుడు.. అంటూ ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రఘు కుంచె లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘గేదెల రాజు’. కాకినాడ తాలూకా అనే ట్యాగ్‌లైన్‌తో చైతన్య మోటూరి దర్శకత్వం వహిస్తున్నాడు. వాణి రవికుమార్ నిర్మిస్తున్నారు. శుక్రవారం రఘు కుంచె పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న రఘు కుంచె గెటప్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచెనే సంగీతం కూడా అందిస్తున్నాడు.