జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ( సెప్టెంబర్ 2026)లో మిథున రాశివారికి గ్రహాలు.. వాటిస్థానాల ఆధారంగా అఖండ రాజయోగంతో పాటు పట్టిందల్లా బంగారమేనని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది. కెరీర్ పరంగా స్థిరత్వం కలిగే అవకాశం ఉంది. గ్రహాల సంచారం ఈ రాశికి అనుకూలంగా ఉన్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సెప్టెంబర్ లో గ్రహాల కదలికల వివరాలు
- సెప్టెంబర్ 2: తులా రాశిలోకి శుక్రుడు
- సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు
- సెప్టెంబర్ 17: కన్యారాశిలోకి సూర్యుడు
- సెప్టెంబర్ 18: కర్కాటక రాశిలోకి కుజుడు
- సెప్టెంబర్ 26: తులా రాశిలోకి బుధుడు
సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుందికొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సొంతింటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలకు పరిష్కారం కలుగుతుంది.మానసిక ప్రశాంతతో పాటు ఆనందం కూడా పొందుతారు. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. సమాజంలో మర్యాదలు పెరుగుతాయి. ఈనెలలో కొత్త పనులు చేపట్టేందుకు ఈ రాశి వారు 1, 4, 16, 18, 26 తేదీలు అనుకూలమైనవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ఉద్యోగస్తుల విషయంలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. గురు, శని గ్రహాల ప్రభావం వలన అన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది . పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
పరిహారాలు: ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజించండి.. ఉపవాస దీక్షను పాటించండి.. ద్వాదశి రోజు వృద్ద బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వండి.. నిత్యం వల్లీ దేవసేన సమేత శుబ్రమణ్యేశ్వరుని పూజించి.. పాలను సమర్పించండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
