జెన్ జెడ్ సరికొత్త డేటింగ్ రూల్స్: రియాలిటీ, నిజాయితీకే జై కొడుతున్న యూత్!

జెన్ జెడ్ సరికొత్త డేటింగ్ రూల్స్: రియాలిటీ, నిజాయితీకే జై కొడుతున్న యూత్!

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లతో బుర్ర పాడుచేసుకోవడం.. ఏం పేరు పెట్టాలో తెలియని ‘సిట్యుయేషన్‌షిప్స్’ గందరగోళంలో మునిగిపోవడం.. ఇవన్నీ పాత ముచ్చట్లు. 2026లో జెన్ జెడ్ కుర్రకారు డేటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అనవసరమైన డ్రామాలు, లేనిపోని బిల్డప్‌లు పక్కనబెట్టి.. ఎమోషనల్ అండర్‌స్టాండింగ్, నో ప్రెజర్, ప్యూర్ హానెస్టీ ఉండే సరికొత్త రిలేషన్స్‌ వైపు అడుగులు వేస్తున్నారు. కేవలం లగ్జరీ హోటళ్లలో డిన్నర్లు, ఖరీదైన గిఫ్ట్‌లు మాత్రమే ప్రేమ అనుకుంటే పొరపాటే.. ఈ తరం లవ్ డిక్షనరీలోకి కొన్ని క్రేజీ పదాలు వచ్చేశాయి. అవేంటో చూస్తే.. అవును కదా నిజంగా భలే ఉన్నాయ్ అంటారు మీరు కూడా. 

1. రోజూవారీ పనుల్లోనే రోమాన్స్:
పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్లి వేలల్లో బిల్స్ కట్టే కంటే.. ఇద్దరూ కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లి గ్రాసరీస్ కొనడం, బట్టలు మడతపెట్టడం, వీకెండ్‌లో వంట చేసుకోవడం లాంటి రొటీన్ పనుల్లోనే వీరు రోమాన్స్ వెతుక్కుంటున్నారట. బోరింగ్ పనులను కూడా కలిసి సరదాగా మార్చుకోవడమే 'చోరొమాన్స్' అంటే.

2. కాంట్రా డేటింగ్:
సాధారణంగా ప్రతి ఒక్కరికీ "నాకు కాబోయే వ్యక్తి ఇలాగే ఉండాలి" అనే ఒక ఫిక్స్‌డ్ టైప్ ఉంటుంది. కానీ పాత పద్ధతులను బ్రేక్ చేస్తూ.. అసలు తమ టేస్ట్‌కు పూర్తి భిన్నంగా ఉండే వ్యక్తులతో డేటింగ్ చేయడాన్నే కాంట్రా డేటింగ్ అంటారు. కొత్త కెమిస్ట్రీని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.

3. ఫ్రీక్ మ్యాచింగ్:
ప్రతి ఒక్కరిలోనూ సమాజానికి చూపించలేని కొన్ని వింత అలవాట్లు, పిచ్చి చేష్టలు ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో కూడా సరిగ్గా అలాంటి వింత అలవాట్లే ఉన్నప్పుడు.. ఆ షేర్డ్ పిచ్చితనం మీద బాండింగ్ పెంచుకోవడమే ఫ్రీక్ మ్యాచింగ్ అంటే. ఇది ఇద్దరి మధ్య అథెంటిక్ రిలేషన్‌ను బిల్డ్ చేస్తుంది.

4. గాబ్లింటిమసీ:
ఇది రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ స్టేజ్. ఎలాంటి జడ్జ్‌మెంట్ భయం లేకుండా.. చిరిగిన నైట్ ప్యాంట్లు వేసుకుని, తల దూవ్వుకోకుండా ఒకరి ముందు ఒకరు గడపగలగడం అన్నమాట. మొహమాటాలు, మొహానికి రంగులు లేకుండా.. తాను ఎలా ఉన్నాడో అలాగే నన్ను యాక్సెప్ట్ చేస్తారనే గట్టి నమ్మకమే ఈ గాబ్లింటిమసీ అంటే.

ALSO READ : ఆ భయంతో ఇన్సూరెన్స్ కొంటున్న జెన్ జెడ్ కుర్రోళ్లు..

5. మైక్రో-మాన్స్:
ఇందులో గ్రాండ్ సర్ప్రైజ్‌లు, సినిమా రేంజ్ ప్రపోజల్స్ ఉండవు. చాలా సింపుల్ గా ఉంటుంది. లవర్ కోసం వాళ్లకు ఇష్టమైన కాఫీ తీసుకురావడం, అడగకుండానే నచ్చిన మీమ్స్ షేర్ చేయడం, రోజులో ఒకసారి గుర్తున్నానని మెసేజ్ చేయడం లాంటి చిన్న చిన్న కేరింగ్ యాక్ట్స్ ద్వారానే కొండంత ప్రేమని చూపిస్తారు. దీనినే మైక్రో-మాన్స్ అంటారు.

6. వైల్డ్‌ఫ్లవరింగ్‌:
అడవి పూలు ఎలాంటి గార్డెనర్ లేకుండానే ప్రకృతిలో స్వేచ్ఛగా పెరుగుతాయి. ఈ రిలేషన్ కూడా అంతే. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఈ బంధానికి ఏమని పేరు పెడదాం? లాంటి గడువులు, కండిషన్లు పెట్టుకోకుండా.. ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ డెప్త్‌ను ఆస్వాదిస్తూ బంధాన్ని దానంతట అదే సహజంగా ఎదగనివ్వడమే ఈ వైల్డ్‌ఫ్లవరింగ్‌ ట్రెండ్.

షో-ఆఫ్ చేసే ప్రేమ కంటే.. ప్రశాంతంగా, మనసుకు నచ్చినట్టు ఉండే రిలేషన్‌షిప్‌లే గ్రేట్ అని జెన్ జెడ్ యూత్ గట్టిగా నమ్ముతోంది ప్రస్తుత మాయా ప్రపంచంలో. అందుకే ఈ 2026 డేటింగ్ ట్రెండ్స్ అన్నీ పర్ఫెక్షన్ కంటే నిజాయితీకే పెద్ద పీట వేస్తున్నాయి. మీ పార్ట్‌నర్‌తో ఇందులో మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో ఓసారి చెక్ చేసుకోండి మరి. ఇలా ఉంటేనే లైఫ్ లో ఒక ఫీలింగ్ ఉంటుందని.. అప్పుడే దాన్ని పూర్తిగా ఆస్వాధించొచ్చని జెన్ జెడ్ యూత్ భావిస్తోంది.