పాత , కొత్త వంటకాలతో Gen Z కొత్త రుచులు..ఫ్యూజన్ ఫుడ్స్‌ నయా ట్రెండ్!

పాత , కొత్త వంటకాలతో Gen Z కొత్త రుచులు..ఫ్యూజన్ ఫుడ్స్‌ నయా ట్రెండ్!

జెన్ జెడ్ యువత మంచి ఫుడీస్ అని చెప్పొచ్చు. రకరకాల రెసిపీలను టేస్ట్ చేస్తుంటారు. దేశ విదేశాలకు చెందిన  వంటకాలను రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మొదట్లో ఇది తింటే ఆరోగ్యం ఏమైతుంది అని ఆలోచించని యువత.. ఇప్పుడు మోడర్న్  రెసిపీలతో , పాతకాలపు మన సాంప్రదాయ ఫుడ్స్ జోడించి  ఆరోగ్యం, రుచి, రంగు, వాసన ఉండేలా కొత్త రకం వంటకాలకు శ్రీకారం చుట్టారు. గ్లోబల్ ఫ్యూజన్ పద్దతులను జోడించి కొత్త హంగులు అద్దుతూ మన సాంప్రదాయ వంటకాలను జెడ్ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం..  

సాంప్రదాయ వంటకాలకు జెన్ జెడ్(Gen Z) యువత వినూత్న ప్రయోగాలు, గ్లోబల్ ఫ్యూజన్ పద్దతులను జోడించి సరికొత్త హంగులు అద్దుతున్నారు. పిజ్జా దోశ, తందూరి మోమోస్, చీజ్ బస్ట్ వడపావ్ వంటి ఫ్యూజన్ రూపాలతో పాటు, పాత వంటకాలను ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్స్‌గా మారుస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. 

విజువల్ అప్పీల్ కోసం వంటకం రుచితో పాటు చూడటానికి చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా ఉండేలా ప్లేటింగ్ చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ ఫ్లాట్ ఫాంలో రీల్స్,  షార్ట్స్ కోసం పాతకాలపు వంటల తయారీని ట్రెండ్‌గా మారుస్తున్నారు. 

మరోవైపు ఫ్యూజన్ ప్రయోగాలు కూడా చేస్తున్నారు. పిజ్జా, టాకోస్ వంటి గ్లోబల్ డిష్‌లలో మన లోకల్ మసాలాలు, సాంప్రదాయ పదార్థాలను కలిపి వంట చేస్తున్నారు. దోశ, ఇడ్లీ, పానీపూరి వంటి వాటికి మోడర్న్ సాస్‌లు, చీజ్ జోడించి స్ట్రీట్ ఫుడ్ ట్విస్ట్ పేరుతో కొత్త రుచులు తెస్తున్నారు. 

ఇక ఆరోగ్యం, సౌలభ్యం రెండు జోడించేలా సంప్రదాయ చిరుతిండ్లను హెల్తీ వెర్షన్స్‌లో తక్కువ నూనెతో గిల్ట్-ఫ్రీ స్నాక్స్ తయారు చేసుకుంటున్నారు.  నెయ్యి రీ-ఎంట్రీ చేస్తూ   డైట్ తయారు చేసుకుంటున్నారు. మన సాంప్రదాయ నెయ్యిని ఆరోగ్యకరమైన కొవ్వుగా భావించి మళ్లీ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు.