టీమిండియాతో.. రెండో టెస్ట్‌‌‌‌కు దూరమయిన గెరాల్డ్‌‌‌‌ కోయెట్జీ

టీమిండియాతో.. రెండో టెస్ట్‌‌‌‌కు దూరమయిన గెరాల్డ్‌‌‌‌ కోయెట్జీ

సెంచూరియన్‌‌‌‌: తొలి టెస్ట్‌‌‌‌ నెగ్గి జోరుమీదున్న సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. పెల్విక్‌‌‌‌  (కటి) వాపు కారణంగా పేసర్‌‌‌‌ గెరాల్డ్‌‌‌‌ కోయెట్జీ రెండో టెస్ట్‌‌‌‌కు దూరమయ్యాడు. తొలి టెస్ట్‌‌‌‌లోనే ఈ వాపు కనిపించగా ఇప్పుడు బాగా పెరిగింది. 

గాయం తీవ్రంగా ఉన్నట్లు స్కానింగ్‌‌‌‌లో తేలడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అయితే కోయెట్జీ ప్లేస్‌‌‌‌లో ప్రత్యామ్నాయ ప్లేయర్‌‌‌‌ను ఇంకా ఎంపిక చేయలేదు. పేస్​ బౌలర్లు వియాన్‌‌‌‌ ముల్డర్‌‌‌‌, లుంగి ఎంగిడిలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.