Virat Kohli: విరాట్ కోహ్లీని తిట్టడానికి డబ్బులు ఆఫర్.. జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli: విరాట్ కోహ్లీని తిట్టడానికి డబ్బులు ఆఫర్.. జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జర్మన్ మోడల్, సింగర్ లిజ్‌లాజ్ ఇన్‌స్టా ఫోటోకు కోహ్లీ లైక్ కొట్టిన అంశం నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయంపై లిజ్‌లాజ్ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది. విరాట్ పై తప్పుడు ఆరోపణలు చేయాలని కొందరు జర్నలిస్టులు తన వద్దకు వచ్చారు.. అందుకు డబ్బు కూడా ఆఫర్ చేశారని ఆమె తెలియజేసింది. 

విరాట్ కోహ్లీ నా ఫోటోకు లైక్ కొట్టడంతో అనూహ్యంగా నేను సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాను.. ఆ ఘటన అనంతరం పలువురు జర్నలిస్టులు నా దగ్గరికి వచ్చి.. కోహ్లీ గురించి చెడుగా మాట్లాడాలని, అతడు చేయని పనులపై కూడా ఆరోపణలు చేయాలని నన్ను కోరారు.. విరాట్ నాకు డైరెక్ట్‌గా మెసేజ్‌లు చేస్తున్నట్లు చెప్పమన్నారు. దానికి నాకు పెద్ద ఎత్తున డబ్బు కూడా ఆఫర్ చేశారని పేర్కొనింది. కానీ నేను అలా ఎందుకు చేస్తాను? విరాట్ అంటే నాకు పిచ్చి.. డబ్బు లేదా పాపులారిటీ కోసం అతడి ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదని లిజ్‌లాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

జర్మనీకి చెందిన లిజ్‌లాజ్‌కు.. జర్మన్‌తో పాటు డచ్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలపై మంచి పట్టు ఉంది. సైకాలజీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసిన ఆమె.. సర్టిఫైడ్ లైఫ్ సేవింగ్ స్విమ్మర్ కూడా.. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, సాంగ్ రైటింగ్ వంటివి ఆమె హాబీలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, విరాట్ కోహ్లీకి తాను పెద్ద అభిమానిని అంటూ గతంలో లిజ్‌లాజ్ చెప్పింది.