ఘోస్ట్ మర్మర్: ఎడారిలో 60 కి.మీ. దూరంలో ఉన్న వ్యక్తి హార్ట్ బీట్ విని కాపాడిన టెక్నాలజీ..!

ఘోస్ట్ మర్మర్: ఎడారిలో 60 కి.మీ. దూరంలో ఉన్న వ్యక్తి హార్ట్ బీట్ విని కాపాడిన టెక్నాలజీ..!

అది ఇరాన్ లోని లుట్ ఎడారి... ఎత్తైన కాలుట్స్ అనే ఎర్రటి మట్టి రాళ్లు.. గాలి కోతతో శిల్పాల్లాగా మారి ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంటాయి. గాలి ఇసుకను తుఫానుగా మారుస్తుంటుంది.. ఆ ఇసుక రేణువుల హోరులో గట్టిగా అరిచినా  వినబడని పరిస్థితి. ఆ భయంకరమైన ఎడారి మధ్యలో ఒక అమెరికన్ పైలట్ తన విమానం కూలిపోవడంతో ప్రాణాలు చేతిలో పెట్టుకుని దాక్కున్నాడు. శత్రువులు చుట్టుముట్టిన ప్రాంతం, సహాయం రావడానికి మైళ్ల దూరంలో తన సైన్యం... ఆ సమయంలో అతని గుండె చప్పుడు మాత్రమే అతన్ని రక్షించింది. అమెరికా సైన్యం చేపట్టిన  అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ లో  కీలక పాత్ర పోషించినది ఒక సీక్రెట్ డివైస్ పేరు.. గోస్ట్ మర్మర్!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈ టెక్నాలజీ గురించే చర్చ జరుగుతోంది. దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి హార్ట్ బీట్ విని కాపాడటమేంటి..? అంటే ఫుల్ క్రౌడ్ తో ఉన్న స్టేడియంలో ఒక వ్యక్తి హార్ట్ బీట్ వినటం ఎంత కష్టమో.. అంతే కష్టమైన పని ఈ డివైజ్ చేసింది.

  • ఘోస్ట్ మర్మర్ ఏం చేస్తుంది..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ ఘోస్ట్ మర్మర్.. సైంటిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేసే ఆవిష్కరణ అని చెప్పవచ్చు. లాంగ్ రేంజ్ క్వాంటం మాగ్నెటోమెట్రీ (Quantum Magnetometry) ఉపయోగించి మానవ హృదయం వెలువరించే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్‌ను మైళ్ల దూరం నుంచి గుర్తిస్తుంది. ఆ సిగ్నల్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ సహాయంతో బ్యాగ్రౌండ్ సౌండ్స్, గాలి, ఇసుక తుఫాను, దూరాన ఉన్న యంత్రాల సౌండ్... ఇలా అన్నింటి నుంచి వడగట్టి ఒక్క హార్ట్ బీట్ ను మాత్రమే ( హృదయ స్పందనను) వేరు చేసి  గుర్తిస్తుంది.  

ఏంటి ఈ టెక్నాలజీ స్పెషల్:

ఈ టెక్నాలజీని లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఇలాంటి సిస్టమ్‌లపై పని చేస్తున్నట్టు లాస్ట్ ఇయరే ప్రకటించారు. సాధారణంగా హాస్పిటల్‌లలో ఛాతీపై సెన్సార్లు పెట్టి హార్ట్ బీట్‌ను మానిటర్ చేస్తారు. కానీ ఇది ఆ సిగ్నల్‌ను కిలోమీటర్ల దూరం నుంచి, బిలియన్ రెట్లు బలహీనమైన స్థితిలో కూడా గుర్తించగలదు. ఇది ఫిజికల్ సైన్స్ బౌండరీస్ లను మించిన ఆవిష్కరణ అని కొందరు అంటున్నారు.

►ALSO READ | వాట్సాప్ మీ డేటాను అమ్ముకుంటోంది.. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్: టెలిగ్రామ్ సీఈఓ ఆరోపణలు

సైనికుడిని కాపాడిన టెక్నాలజీని యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ డివైస్ గురించి మాట్లాడుతూ, ఇది చాలా ముఖ్యమైనది. దీని గురించి ఎవరికీ తెలియదు. ఇలాంటి ఎక్విప్‌మెంట్స్ మాకు ఇంకా చాలా ఉన్నాయి... ఎవరూ ఊహించనంత అద్భుతమైనవి అంటూ చెప్పుకొచ్చారు.  అయితే దీనిపై  శాస్త్రవేత్తలు ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని బ్యాగ్రౌండ్ సౌండ్స్ ను ఎలా  ఎలా ఫిల్టర్ చేస్తుంది.. అని ప్రశ్నిస్తున్నారు. కొందరు దీనిని మిలిటరీ మిత్ అని కూడా అంటున్నారు. ఘోస్ట్ మర్మర్ నిజమైన మిరాకిల్ టెక్నాలజీనా... లేక సైనికులు సృష్టించిన ఒక అందమైన కల్పనా? అనేది సైంటిస్టులు డిసైడ్ చేయాల్సి ఉంది.