పెద్ది మాస్‌‌‌‌ ర్యాంపేజ్‌‌‌‌కు రెడీ.. చరణ్ బర్త్ సందర్భంగా ఫ్యాన్స్‎కు మెగా ట్రీట్

పెద్ది మాస్‌‌‌‌ ర్యాంపేజ్‌‌‌‌కు రెడీ.. చరణ్ బర్త్ సందర్భంగా ఫ్యాన్స్‎కు మెగా ట్రీట్

రామ్‌‌‌‌చరణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకుడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి,  రైరా పాటలకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో అప్‌‌‌‌డేట్‌‌‌‌ ఇచ్చారు మేకర్స్‌‌‌‌. ఈ నెల 27న రామ్ చరణ్‌‌‌‌ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ గ్లింప్స్‌‌‌‌ను  విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆరోజు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఇది విడుదల కానుంది. ఇదొక మాస్‌‌‌‌ ర్యాంపేజ్‌‌‌‌గా మెప్పించడం ఖాయమని మేకర్స్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.  

ఇదిలా ఉంటే.. ఈ మూవీ సెట్‌‌‌‌లో ఓ యాక్షన్ సీన్‌‌‌‌ చేస్తుండగా రామ్ చరణ్‌‌‌‌ గాయపడ్డారు. దీనిపై అభిమానులు కలవరపడుతున్న నేపథ్యంలో మేకర్స్‌‌‌‌ క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ సమయంలో ఎడమ కంటికి చిన్న గాయం కావడంతో ఒక చిన్న ప్రొసీజర్ చేశామని చెప్పారు. షెడ్యూల్స్‌‌‌‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా గురువారం నుంచి తిరిగి రామ్ చరణ్​ షూటింగ్‌‌‌‌లో పాల్గొంటారని స్పష్టం చేశారు. 

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌‌‌‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏఆర్‌‌‌‌‌‌‌‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.