గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ( 27 మార్చి 2026 ) తన పుట్టినరోజును జరుపుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం రోజే చరణ్ పుట్టినరోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఆనందానికి అవదులు లేవు. చెర్రీ బర్త్ డేను ఒక పండుగలా జరుపుకున్నారు. అటు ఈ ఏడాది చరణ్ బర్త్‌డే మెగా కుటుంబంలో సరికొత్త వెలుగులు నింపింది
తండ్రిగా గర్వం..
తన కుమారుడి ఎదుగుదలను చూసి మెగాస్టార్ చిరంజీవి మురిసిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ఒక తండ్రిగా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు సాధిస్తున్న విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలి అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. అటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
అంతే కాకుండా.. తనకు ఇటీవల లభించిన 'ఎన్టీఆర్ అవార్డు' నగదు బహుమతి రూ.10 లక్షలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పనిచేస్తున్న దేవనార్ ఫౌండేషన్, అనాథ చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు.
ప్రత్యేకంగా శాంతి హోమం..
ఉదయాన్నే మెగా నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చరణ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఇంట్లోనే ప్రత్యేకంగా శాంతి హోమం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పంచెకట్టులో కనిపించిన చరణ్, హోమం అనంతరం తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి, మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
శ్రీరామజయం....!
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026
ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం..!
ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం.
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు…
రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని… pic.twitter.com/WPQhI2IITS
'పెద్ది'గా పవర్‌ఫుల్ లుక్ ..
రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) తో ప్రేక్షకులను పలకరించనున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బర్త్‌డే కానుకగా ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో చరణ్ ఒక పవర్‌ఫుల్ 'పహిల్వాన్' లుక్‌లో దర్శనమిచ్చారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు. ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
సామాజిక సేవలో అభిమానులు
కేవలం కేకులు కోయడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని రామ్ చరణ్ అభిమాన సంఘాలు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, నిరుపేద విద్యార్థులకు పాఠశాల కిట్ల పంపిణీ వంటి కార్యక్రమాలతో తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. చరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలని 'పెద్ది' సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని కోరుకుంటూబర్త్ డే విషెస్ తెలిపారు.
