రామ్ చరణ్కు పాప్ గోల్డెన్ అవార్డ్.. లిస్టులో బాలీవుడ్ టాప్ స్టార్స్

రామ్ చరణ్కు పాప్ గోల్డెన్ అవార్డ్.. లిస్టులో బాలీవుడ్ టాప్ స్టార్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా భావించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు రామ్ చరణ్. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ అవార్డ్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం..రామ్ చరణ్ తోపాటు షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, దీపికా పదుకొణె, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా పోటీపడ్డారు. ఈ స్టార్స్ అందరినీ వెనక్కి నెట్టి ఈ అవార్డును దక్కించుకున్నాడు మెగా పవర్ స్టార్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను పలు హాలీవుడ్ అవార్డులు అందుకున్న ఈ మెగా హీరో.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.