చిన్న వ్యాపారుల కోసం గోడ్యాడీ స్టూడియో

చిన్న వ్యాపారుల కోసం గోడ్యాడీ స్టూడియో

హైదరాబాద్​, వెలుగు:   చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు గోడ్యాడీ సంస్థ ‘స్టూడియో’ అనే యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్ వీడియో అనే కొత్త ఏఐ-  ఆధారిత ఫీచర్​తో తమకు కావాల్సిన వీడియోలను డెవలప్​ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం ఆకర్షణీయమైన, ప్రొఫెషనల్​ వీడియోలను సృష్టించవచ్చు. 

వీటి ద్వారా ఈ సంస్థలు కస్టమర్లకు మరింత చేరువ కావొచ్చు. గోడ్యాడీ స్టూడియోలోని టెంప్లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయంతో ప్రొడక్ట్ డెమోలు, ట్యుటోరియల్ వీడియోలు, బ్రాండ్  ప్రొఫెషనల్ వీడియోలను రూపొందించి  సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు. టెక్నికల్​ నాలెడ్జ్​ లేని వాళ్లు కూడా ఈ యాప్​తో కంటెంట్ క్రియేటర్లకు గా మారవచ్చని గో డ్యాడీ తెలిపింది.