మీ చావు మీరు చావండి.. మీ ఆయిల్ మీరు తెచ్చుకోండి : హార్మూజ్పై చేతులెత్తేసిన ట్రంప్..!

మీ చావు మీరు చావండి.. మీ ఆయిల్ మీరు తెచ్చుకోండి : హార్మూజ్పై చేతులెత్తేసిన ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులెత్తేశారా.. ఇరాన్ పై వెనక్కి తగ్గుతున్నారా.. హర్మూజ్ జల సంధి తెరవకపోతే ఇరాన్ దేశంలోని విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను నేలమట్టం చేస్తానంటూ ఢాంబికాలు పలికిన ట్రంప్.. 24 గంటల్లోనే మాట మార్చారు. హర్మూజ్ జల సంధిని తెరవటం ఇప్పట్లో అయ్యే పని కాదనే ఉద్దేశానికి వచ్చినట్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంధన కొరతతో అల్లాడుతున్న దేశాలకు కొత్త సందేశం ఇచ్చారు.. మీ ఆయిల్ మీరు తెచ్చుకోండి.. అమెరికా నుంచి కొంటారో లేక ఇతర దేశాల నుంచి కొంటారో మీ ఇష్టం.. ఆయిల్ విషయంలో మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.. మీ చావు మీరు చావండి అన్నట్లు స్పష్టం చేశారు ట్రంప్.

ఇరాన్ పై యుద్ధంలో ఇప్పటికే నిరాశ, నిస్పృహలకు లోనవుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ ప్రకటనతో పూర్తిగా చేతులెత్తేస్తున్నారా... అన్న అనుమానం కలగక మానదు. మిడిల్ ఈస్ట్ లో ఒక్క ఇజ్రాయెల్ ను నమ్ముకుని యుద్ధానికి దిగిన ట్రంప్.. బిలియన్ డాలర్లు ఖర్చు చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. హార్మూజ్ పైన ఇరాన్ కు ఉన్న పట్టు అమెరికా వెనకకు తగ్గేలా చేసింది. అంతే కాకుండా అమెరికా, ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాల చమురు నౌకలకు అనుమతిస్తూ ఈ రెండు దేశాలను దారుణంగా దెబ్బకొడుతోంది ఇరాన్.

ఈ క్రమంలో యుద్ధంలో గెలవలేక పోతున్నాననే అసహనంతో నాటో కూటమి దేశాలపై మండిపడుతున్నారు ట్రంప్. యుద్ధంలోకి యునైటెడ్ కింగ్డమ్ (యూకే), ఫ్రాన్స్ లాంటి దేశాలు రావడానికి సంకోచిస్తున్నాయని.. అలాంటప్పుడు ఆయిల్ గురించి అమెరికా ఎందుకు కష్టపడాలని అన్నారు. అందుకే మీ చావు మీరు చావండి.. మీ ఆయిల్ మీరు తెచ్చుకోండి.. మీ కోసం అమెరికా ఎందుకు నష్టపోవాలి అన్న కోణంలో కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. 

హార్మూజ్ జలసంధి కారణంగా అన్ని దేశాలకు జెట్ ఇంధనం పొందలేని పరిస్థితి. అందుకు ఉదాహరణ యూకే. ఇరాన్ యుద్ధంలో పాల్గొనటానికి సంకోచంచింది. కానీ ఇప్పుడు యుద్ధ విమానాలకు ఇంధనం దొరకని పరిస్థితుల్లో ఉంది. ఈ సందర్భంగా నేనొక రెండు సలహాలు ఇస్తున్నాను. 

  1. ఇంధనాన్ని అమెరికాతో కొనండి. మా దగ్గర చాలా ఆయిల్ ఉంది.
  2. కొంత ధైర్యాన్ని తెచ్చుకోండి. హార్మూజ్ జలసంధి దగ్గరకు వెళ్లండి. అక్కణ్నుంచే తీసుకోండి..

అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. మీకోసం మీరు ఎలా కొట్లాడాలో అమెరికాను చూసి నేర్చుకోండి. మీకు సహాయం చేసేందుకు మేము ఇక ఏ మాత్రం రాలేము. మాకోసం ఇరాన్ యుద్ధంలోకి మీరెలా రాలేదో మేము కూడా అంతే.. అంటూ పోస్ట్ చేశారు. అంతా నాశనమైంది. కష్టమైన పని అంతా అయిపోయింది. ఇక వెళ్లి మీ చమురు మీరు తెచ్చుకోండి.. అంటూ సలహా ఇచ్చారు ట్రంప్.