Paraguay Goalkeeper Orlando Gill: ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి, కానీ ఈరోజు (జూన్ 30న , మంగళవారం) తెల్లవారుజామున జరిగిన మ్యాచ్ పరాగ్వే ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన రాత్రిగా నిలిచిపోతుంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీని రౌండ్ ఆఫ్ 32లోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసి పరాగ్వే రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. 120 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరు 1– 1తో డ్రా కాగా, ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే 4–3తో చారిత్రాత్మక విజయం సాధించింది. వరల్డ్ కప్ హిస్టరీలో జర్మనీ ఒక పెనాల్టీ షూటౌట్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కొడుకు కోసం బూట్లు, జెర్సీలు అమ్ముకున్న తండ్రి:
ఈరోజు పరాగ్వే దేశమంతా ఒర్లాండో గిల్‌ను ఆకాశానికెత్తుతోంది కానీ, అతను ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలు ఫుట్‌బాల్ మ్యాచ్ కంటే పెద్దవి.. కొన్ని సంవత్సరాల క్రితం తన బాబు పుట్టినప్పుడు, మెడికల్ ఖర్చుల (Medical Costs) కోసం గిల్ దగ్గర పైసా లేదు. ఆ సమయంలో తన కొడుకును కాపాడుకోవడం కోసం ఒర్లాండో గిల్ తన దగ్గరున్న ఫుట్‌బాల్ బూట్లు, ట్రైనింగ్ ఎక్విప్‌మెంట్, చివరికి తను ఎంతో ప్రాణంగా దాచుకున్న 'పరాగ్వే U20 జెర్సీ'ని కూడా అమ్మేశాడు. ఒకప్పుడు కనీసం బూట్లు కూడా లేని ఆ పేద ప్లేయరే, ఈరోజు జర్మనీ వంటి ఫుట్‌బాల్ దిగ్గజ దేశాన్ని వణికించి, తన కంట్రీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతని పట్టుదల, కష్టపడే తత్వమే ఈరోజు అతన్ని హీరోని చేశాయి.
ఒర్లాండో గిల్ వరల్డ్ కప్ ప్రదర్శన:
* వరల్డ్ కప్‌లో క్లీన్ షీట్స్: 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో పరాగ్వే ఆడిన గ్రూప్-డి మ్యాచ్‌లలో మూడింటికీ గిల్ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 4 గోల్స్ సమర్పించుకున్నప్పటికీ, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, టర్కీలపై) ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా క్లీన్ షీట్స్ నమోదు చేశాడు.
* 10వ మ్యాచ్‌లోనే హిస్టరీ: పరాగ్వే జాతీయ జట్టు తరఫున గిల్‌కు ఇది 10వ అంతర్జాతీయ మ్యాచ్.. తన 10వ మ్యాచ్‌లోనే జర్మనీ లాంటి బలమైన టీమ్‌ను వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ చేసి దేశంలోనే బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్‌కు కారణమయ్యాడు.
ఫ్రాన్స్ తోనే పరాగ్వే నెక్ట్స్ ఫైట్:
2014లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జర్మనీ జట్టుకు నాకౌట్ స్టేజ్‌లో ఇదే తొలి ప్రదర్శన.. అయితే పరాగ్వే ఇచ్చిన షాక్‌తో వారు మరోసారి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ విజయంతో రౌండ్ ఆఫ్ 16కు చేరిన పరాగ్వే (La Albirroja) తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన ఫ్రాన్స్ జట్టును ఎదుర్కొనే అవకాశం ఉంది (ఒకవేళ ఫ్రాన్స్ జట్టు స్వీడన్‌పై గెలిస్తే).. జర్మనీని ఓడించిన ఊపులో ఉన్న ఒర్లాండో గిల్.. ఫ్రాన్స్ ఎటాకింగ్‌ను కూడా అడ్డుకుని పరాగ్వేను క్వార్టర్స్ వైపు నడిపిస్తాడో లేదా అనేది చూడాల్సి ఉంది.
Paraguayan national hero Orlando Gill is your man of the match! 🇵🇾🎙️#WorldCup pic.twitter.com/lHYptqen0y
— DAZN Football (@DAZNFootball) June 30, 2026
Give Orlando Gill the Player of the match
— Prateek (@prateek_295) June 29, 2026
Paraguay have produced best match of the world cup so far by eliminating Germany.
pic.twitter.com/5LuZwL2H98
TARİHİ GECE! 🇵🇾
— Ipswich Town Türkiye 🇹🇷 (@IpswichTurkiye) June 29, 2026
Paraguay, Almanya’yı eleyerek Dünya Kupası’nda son 16 turuna yükseldi! 😱🔥
Eski Ipswichli Julio Enciso’nun golüyle gelen galibiyette, gecenin asıl kahramanı ise Orlando Gill oldu. 🧤⭐
Paraguay kalecisi, kurtardığı 2 penaltıyla takımını adeta sırtladı ve… pic.twitter.com/MuyArVo2pI
