గాడ్జిల్లా అండ్ కాంగ్ మళ్లీ వస్తున్నాయ్

గాడ్జిల్లా అండ్ కాంగ్ మళ్లీ వస్తున్నాయ్

కింగ్ కాంగ్, గాడ్జిల్లా సినిమాలకు మన దేశంలోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు భారీ జంతువులు లీడ్ రోల్స్‌‌లో మాన్‌‌స్టర్‌‌‌‌ యూనివర్స్‌‌లో భాగంగా  ఇప్పటికే నాలుగు సినిమాలు రాగా, ఐదో సినిమాగా ‘గాడ్జిల్లా అండ్ కాంగ్‌‌: ది న్యూ ఎంపైర్‌‌‌‌’ సినిమా వస్తోంది. ఆడమ్ విన్ గార్డ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

వార్నర్‌‌‌‌ బ్రదర్స్, లెజెండరీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘గాడ్జిల్లా అండ్ కాంగ్: ఓ నూతన సామ్రాజ్యం’ పేరుతో ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. సోమవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో విజువల్స్ ఇంప్రెస్ చేశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది.