దసరా పండుగ తర్వాత గోల్డ్, సిల్వర్ క్రాష్.. హైదరాబాదులో తగ్గిన రేట్లివే!

దసరా పండుగ తర్వాత గోల్డ్, సిల్వర్ క్రాష్.. హైదరాబాదులో తగ్గిన రేట్లివే!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది దసరా పండుగ సందర్భంగా కొత్త ఆభరణాలు, వస్తువులు షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే రేట్ల తగ్గింపుల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం దీపావళి లోపు కొనాలని అనుకుంటున్నారు. అలాంటి వారికి దసరా తర్వాత మంచి అవకాశం లభించింది. ఎందుకంటే పండగ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఊహించనంతగా తగ్గాయి. అయితే షాపింగ్ చేయటానికి ముందుగా మీ నగరాల్లో మారిన రేట్లను పరిశీలించి ముందుకు సాగటం బెటర్. 

అక్టోబర్ 22న బంగారం రేట్లు తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.170 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 438గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 235గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 22, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు రోజుల్లో కేజీకి రూ.15వేలు తగ్గి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 25వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.225 దగ్గర ఉంది.