దసరాకి బంగారం బేజారు.. వరుసగా 5వ రోజున గ్రాముకు ఎంత తగ్గిందో తెలుసా?

దసరాకి బంగారం బేజారు.. వరుసగా 5వ రోజున గ్రాముకు ఎంత తగ్గిందో తెలుసా?

ఈ ప్రారంభం నుంచి బంగారం రేట్లు రోజూ తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. మరో పక్క స్థిరంగా కొనసాగిన వెండి ధరలు కూడా ఊహించని రీతిలో తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా వివిధ కారణాలు బులియన్ మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీయటమే ఈ పరిస్థితులకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. దసరా పండుగ వేళ షాపింగ్ తో ఈ రేట్ల పతనాన్ని సదవకాశంగా మలుచుకుందాం అనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్. 

అక్టోబర్ 15న బంగారం రేట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.82 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 744గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 515గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 15, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.