ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల నిలిపివేత, బలంగా ఉన్న డాలర్, అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఊహాగానాలకు బంగారం మసకబారుతోంది. వడ్డీ ఆదాయం కూడా రానీ గోల్డ్ కంటే ఇతర పెట్టుబడి మార్గాలు బెటర్ ప్రస్తుతం అని చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తుండటంతో బులియన్ మార్కెట్లు ఢీలాగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని అనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ ధరలను పరిశీలించటం బెటర్.
జూన్ 29న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 28 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.93 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 302గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 110గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 29, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 45వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
