క్రూడ్ మంటల్లో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లు ఇవే..

క్రూడ్ మంటల్లో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లు ఇవే..

యుద్ధం స్టార్ట్ అయ్యి రెండు వారాలు పూర్తి కావొస్తున్న వేళ క్రూడ్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో డాలర్ బలపడుతుండగా బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. అనిశ్చితి పెరుగుతున్నప్పుడు సాధారణంగా పెరగాల్సిన గోల్డ్ అండ్ సిల్వర్ ప్రస్తుతం పడిపోతుండటంతో భారతీయులు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికి ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తగ్గిన రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది. 

మార్చి 12న బంగారం రేట్లు తగ్గాయి. దీంతో మార్చి 11 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.109 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 222గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 870గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 12, 2026న దేశవ్యాప్తంగా రేట్లు తగ్గాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.10వేలు తగ్గి రూ.2లక్షల 90వేల వద్ద ఎలాంటి  కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.290 వద్ద ఉంది.