దసరా తర్వాత బ్రేక్ తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో రేట్లు ఎంతంటే?

దసరా తర్వాత బ్రేక్ తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో రేట్లు ఎంతంటే?

ఈసారి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఆభరణాలు కొనాలనుకుంటున్న వారికి సువర్ణ అవకాశం లభించింది. నిన్న దసరా రోజున తగ్గిన ధరలు ఈరోజు కూడా స్థిరంగా కొనసాగుతుండటంతో చాలా తెలుగు ఫ్యామిలీస్ షాపింగ్ చేయాలని ప్లాన్స్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్ షాపర్స్.

అక్టోబర్ 21న బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 608గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 390గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 21, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.