శుక్రవారం జంప్ కొట్టిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో ఎంత పెరిగాయంటే?

శుక్రవారం జంప్ కొట్టిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదులో ఎంత పెరిగాయంటే?

ఇరాన్ డీల్ శాంతియుతంగా కొనసాగుతుండటంతో బులియన్ మార్కెట్లు కూల్ అయ్యాయి. డాలర్ ప్రభంజనంతో పాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఆశలు బంగారం వైపు ఇన్వెస్టర్లు చూడకుండా చేస్తున్నాయి. దీంతో నిన్నటి వరకూ తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు శుక్రవారం తిరిగి పుంజుకున్నాయి. దీంతో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలోని ధరలను పరిశీలించటం బెటర్. 

జూన్ 26న బంగారం రేట్లు పెరిగాయి. జూన్ 25 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.27 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 160గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 980గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 26, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 35వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.